ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ ఇక మరింత సులభం..!

SMTV Desk 2018-01-04 15:01:18  adhar card mobile number link, interactive voice response, services.

న్యూఢిల్లీ, జనవరి 4 : మొబైల్ నె౦బరును ఆధార్‌తో అనుసంధాన౦ చేయడం ఇక మరింత సులభతరం. వినియోగదారులు ఆయా మొబైల్ స‌ర్వీస్ స్టోర్ల ద‌గ్గ‌ర పెద్ద పెద్ద క్యూలు కట్టి నానా అవస్థలు పడుతున్న క్రమంలో కొన్ని సార్లు స‌ర్వ‌ర్ ప‌నిచేయడం లేదంటూ వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్యలన్ని౦టికీ ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభుత్వం కొత్త స‌దుపాయం ప్ర‌వేశ‌పెట్టింది. దీంతో వినియోగదారులు స్టోర్ల‌కి వెళ్ల‌కుండానే ఆధార్‌తో తమ మొబైల్ నెంబరును అనుసంధానం చేసుకోవచ్చు. అదెలా అంటారా.! 14546 అనే టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కి ఫోన్ చేసి ఇంట‌రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్ట‌మ్ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేయ‌వ‌చ్చు. మొదట ఈ నెంబ‌ర్‌కి ఫోన్ చేయగానే.. మీరు భార‌తీయులా? కాదా? అనే విష‌యాన్ని అడుగుతుంది. అనంతరం 12 అంకెల ఆధార్ సంఖ్య‌ను ఎంట‌ర్ చేయాలి. అప్పుడు మొబైల్ నెంబరుకు వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది. ఆ ఓటీపీని క‌న్‌ఫ‌ర్మ్ చేస్తే అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఆధార్‌తో మొబైల్ నెంబరును అనుసంధానం చేసుకోండి.