అంధత్వాన్ని తగ్గించేందుకు రూ.5కోట్ల మెడిసిన్..?

SMTV Desk 2018-01-04 13:33:50  colour blindness, spark theritiks, luxtarna medicine, america.

న్యూయార్క్‌, జనవరి 4 : వంశపారంపర్యంగా వచ్చే రెటీనా జీవ కణజాల క్షీణతను తగ్గించేందుకు అత్యంత ఖరీదైన మెడిసిన్‌ ను అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన స్పార్క్‌ థెరపిటిక్స్‌ అనే సంస్థ తయారు చేసింది. "లక్స్‌టర్నా" అనే పేరుగల ఈ మెడిసిన్‌ ధర రూ.5,39,79,250 (8,50,000 డాలర్లు)గా నిర్ణయించింది. ఒక కన్నుకే అయితే మాత్రం రూ.2,69,89,625(4,25,000 డాలర్లు) అని తెలిపింది. ఒకవేళ ఈ మెడిసిన్ పనిచేయకపోతే ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ మెడిసిన్ ధరపై అమెరికాలో చర్చ జరుగుతోంది.