ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావాలనుకోలేదట..!

SMTV Desk 2018-01-04 12:04:12  America president, Donald trump, Fire and pyuri in side the trump white house book.

వాషింగ్టన్, జనవరి 4 : అగ్ర రాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావాలని ఎప్పుడు అనుకోలేదట.. ఈ విషయాన్ని అమెరికన్‌ జర్నలిస్ట్‌ మైఖెల్‌ వూల్ఫ్‌ తాను రాసిన "ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ: ఇన్‌సైడ్‌ ది ట్రంప్‌ వైట్‌ హౌస్‌" అనే పుస్తకంలో పేర్కొన్నారు. ప్రపంచంలో ఫేమస్‌ వ్యక్తి కావాలన్నది ట్రంప్ కలని.. అధ్యక్షుడిగా గెలవాలని మాత్రం కాదని ట్రంప్‌ తన స్నేహితుడైన సామ్‌ నన్‌బర్గ్‌కు చెప్పారట. ట్రంప్ కెరీర్ బాగుండాలంటే అధ్యక్షుడిగా పోటీ చేయాల్సిందేనని ట్రంప్‌కు తన స్నేహితుడు రోజర్‌ ఎయిల్స్‌ తెలపడంతో అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేశారు. అంతేకాకుండా ఈ పుస్తకం కూడా ట్రంప్ ప్రోత్సాహం వల్లే రాశానని మైఖెల్‌ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలిచారని వెల్లడించగానే ఏదో దెయ్యాన్ని చూసినట్లుగా ఆయన ఫీలయ్యారని, ఆయన భార్య మెలానియా సంతోషంతో ఏడ్చేశారని మైఖెల్ వెల్లడించారు.