పండగకు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు..

SMTV Desk 2018-01-04 11:07:48  railway special trains, railway department,

అమరావతి, జనవరి 4 : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. పండగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. * తిరుపతి - విశాఖపట్నం - తిరుపతి ప్రత్యేక రైలు 07487 నెంబరుతో ఈ నెల 7, 14, 21, 28 ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో తిరుపతి నుండి రాత్రి 10.30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45కి విశాఖపట్నం చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 07488 అనే నెంబరుతో ఈ నెల 8, 15, 22, 29 ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో విశాఖపట్నంలో రాత్రి 7.20కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10కి తిరుపతి చేరుకుంటుంది. * రైలు నెంబరు 07016 కాచిగూడ - విశాఖపట్నం ప్రత్యేక రైలు ఈ నెల 6, 13, 20, 27 తేదీల్లో కాచిగూడలో సాయంత్రం 6.45కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50కి విశాఖపట్నం చేరుకుంటుంది. * రైలు నెంబరు 07479 విశాఖపట్నం - తిరుపతి ప్రత్యేక రైలు విశాఖపట్నంలో ఫిబ్రవరి 7, 14, 21, 28వ తేదీల్లో రాత్రి 7.05కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.25కి తిరుపతి చేరుకుంటుంది. * రైలు నెంబరు 07146 తిరుపతి - కాచిగూడ ప్రత్యేక రైలు ఈ నెల 8, 15, 22 మార్చి 1వ తేదీల్లో తిరుపతిలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కి కాచిగూడ చేరుకుంటుంది. * రైలు నెంబరు 07148 హైదరాబాద్‌ - విశాఖపట్నం - హైదరాబాద్‌ ప్రత్యేక రైలు నెల 10,12 తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 5.45కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.15కి విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07147 నెంబరుతో ఈ నెల 11, 13 తేదీల్లో విశాఖపట్నంలో సాయంత్రం 6.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45కి హైదరాబాద్‌ చేరుకోనుంది.