ఈ నెల 31న "బ్లూ మూన్" గ్రహణం

SMTV Desk 2018-01-04 10:57:46  Blue Moon eclipse on 31 January, us

వాషింగ్టన్, జనవరి 4 : ఈ నెల 31న వచ్చే పౌర్ణమి రోజు కనిపించే నిండు చంద్రుడు(బ్లూ మూన్‌) సంపూర్ణంగా గ్రహణ ప్రభావానికి గురికానున్నాడు. అయితే, 2018 ప్రారంభంలోనే మంగళవారం పున్నమి రావడంతో, ప్రజలకు కనువిందు చేస్తూ చందమామ నిండు కళలతో మెరిసిపోయింది. ఒకే నెలలో రెండోసారి ఈ నిండు చంద్రుడిని పూర్ణ చంద్ర దర్శనం కలుగనున్నదని, అయితే అదే రోజు చంద్ర గ్రహణం కావటంతో, ఇది పాక్షికంగా మాత్రమే కన్పిస్తుందని చెబుతున్నారు. జనవరి 31 నాటి సంపూర్ణ చంద్ర దర్శనం ఉత్తర అమెరికా, పసిఫిక్‌ ప్రాంతం నుండి ఆసియా తూర్పు ప్రాంతాల వారికి కనువిందు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా బ్లూ మూన్‌ సంపూర్ణ గ్రహణం ఏర్పడనుండటం గత 150 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1866 మార్చి 31న ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మొత్తం 77 నిమిషాలపాటు కనువిందు చేసే ఈ ఖగోళ పరిణామన్ని అలస్కా, హవాయి, వాయువ్య కెనడా ప్రజలు సంపూర్ణ బ్లూ మూన్‌ గ్రహణాన్ని ప్రారంభం నుంచి అంతం వరకు పూర్తిగా వీక్షించవచ్చు.