మరో 48 గంటల్లో పాక్ పై చర్యలు తీసుకుంటా౦ : సారా శా౦డర్స్

SMTV Desk 2018-01-03 19:05:34  AMERICA, PAKISTAN, WHITE HOUSE, SARA SANDERS

వాషింగ్టన్, జనవరి 3 : పాకిస్తాన్ వంచన తీరుపై అమెరికా తన తదుపరి కార్యాచరణను వేగవంతం చేసింది. ఉగ్రవాద విషయంలో పాకిస్తాన్ అగ్ర రాజ్యంను మోసం చేస్తుందని కారణంతో తాజాగా ట్రంప్ ఆ దేశానికి సైనిక సాయం నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అమెరికా శ్వేతసౌధ ప్రతినిధి సారా శా౦డర్స్ మాట్లాడుతూ..” ఉగ్రవాదాన్ని ఆపే సామర్ధ్యం పాక్ కు ఉంది. పాక్‌ నుంచి మేమూ అదే కోరుకుంటున్నాం. ఉగ్రవాదంపై పోరుకు పాకిస్థాన్‌ చర్యలు తీసుకోకపోతే మరో 48 గంటల్లో పాకిస్థాన్‌పై అమెరికా మరిన్ని చర్యలు తీసుకుంటుంది” అని వెల్లడించారు. పాకిస్థాన్‌ అమెరికాతో ద్వంద వైఖరి అవలంబిస్తుందని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలి ప్రకటించిన కొద్దిసేపటికే శాండర్స్‌ పై విధంగా స్పందించారు.