పులుల్నే చంపి తింటున్న గ్రామస్థులు

SMTV Desk 2018-01-03 18:05:38  Tigers Killing villagers, maharashtra pandharkwada

మహారాష్ట్ర, జనవరి 03 : పులులు ఆహరం కోసం వేటకు వెళ్లడం వింటూనే ఉంటాం. కానీ, మనుషులు పులులను ఆహారంగా తీసుకోవడానికి వేటకు వెళ్లడం ఎక్కడైనా జరిగిందా అంటే, అది మహారాష్ట్రలోని పందార్‌క్వడ గ్రామామనే చెప్పవచ్చును. అంతేకాకుండా దీన్ని ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. పులులకే దడ పుట్టిస్తున్న ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాల ప్రజలు కూడా పులులను ఆహారంగా పంపిణీ చేస్తున్నారు. ఇంతకి ఈ గ్రామస్థులు ఇలా చేయడానికి గల కారణాలు తెలుసుకోవడానికి అధికారులు గ్రామంలో విచారించగా...గతంలో గ్రామస్థులు రాత్రి పూట పొలాలకు కాపల వెళ్లేవారు, పశువుల కాపరులు, అడవిలో ఇతర చిన్న చిన్న పనులు చేసేవారు కానీ తిరిగి వచ్చేవారు కాదు. అలా జూన్‌ 2016 సంవత్సరంలో దాదాపు పులుల బారిన పడి సుమారు 9 మందికి పైగా మరణించారు. దాంతో గ్రామస్థులందరూ కలిసి పులుల్ని చంపి తినాలని నిర్ణయించుకున్నారు. రోజురోజుకి అడవిలో పులుల సంఖ్య తగ్గిపోతుండటంతో అనుమానం వచ్చిన అధికారులు అడవిలో రహస్యంగా కెమెరాలు అమర్చారు. దీంతో గ్రామస్థులు చేస్తున్న నిర్వాకం బయటకు వచ్చింది. అటవీ అధికారులు వారికి ఇక నుంచి పులుల్ని చంపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.