పార్లమెంటులో భాజపా, కాంగ్రెస్‌ సభ్యులు పరస్పర విమర్శలు

SMTV Desk 2018-01-03 17:26:56  Parlament, BJP Congress comments delhi

న్యూఢిల్లీ, జనవరి 03 : భారత ప్రధాని నరేంద్ర మోదీపై నేడు లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో దళితుల నిరసనలతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో మోదీ "మౌని బాబా" లా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో భాజపా, కాంగ్రెస్‌ సభ్యులు పరస్పర విమర్శలు చేసుకున్నారు. అయితే, బ్రిటిష్ పాలనలో భీమా కొరేగావ్‌ పోరాటానికి 200ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలో దళితులు సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మరో వర్గానికి చెందిన వారి మధ్య తలెత్తిన హింస కారణంగా 28ఏళ్ల దళిత వ్యక్తి మరణించడంతో, రెండు రోజులుగా ఆందోళనలు చెలారేగుతున్నాయి. దీంతో శాంతి నెలకొనడానికి కృషి చెయ్యాలే తప్ప, మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని భాజపా నేత అనంత్‌కుమార్‌ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.