నేడు మహారాష్ట్రలో బంద్ :అప్రమత్తమైన పోలీసులు

SMTV Desk 2018-01-03 11:48:13  BIma, Corregaw Maratha community attacks on sc mumbai

మహారాష్ట్ర, జనవరి 03 : బీమా కోరెగావ్ లో ఈ నెల 1న చెలరేగిన హింస మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. అసలు విషయంలోకి వెళ్లితే...మహారాష్ట్ర రాజధాని ముంబయి దళితులపై మరాఠా కమ్యూనిటీ దాడులకు దిగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆందోళన చెందిన వర్గం వారు పలు వాహనాలను తగాలబెట్టారు. 1818 జనవరి 1న రెండో పీష్వా బాజీరావ్ సేనలపై బ్రిటిష్ సేనలు సాధించిన విజయానికి గుర్తుగా దళితులు సంబరాలు చేసుకున్నారు. అప్పట్లో దళితులు బ్రిటిష్ సేనల్లో భాగంగా ఉన్నారు. అయితే, 200 ఏళ్లనాడు జరిగిన యుద్ధంలో ఆంగ్లయులను గుర్తుచేసుకుంటూ పూణే జిల్లాలోని బీమా, కోరెగావ్ గ్రామంలో సోమవారం ఉత్సవాలు నిర్వహించగా, మరో మరాఠా కమ్యూనిటీని ఆగ్రహానికి గురి చేసింది. ఫలితంగా దళితులపై దాడులు జరిగాయి. ఈ మేరకు ముంబై, పూణేలో అనేక చోట్ల ఆందోళన కారులు విధ్వంసానికి దిగారు. వాహనాలు రైళ్ల రాకపోకాలను అడ్డుకున్నారు. దీంతో ఎక్కడికాక్కడ భద్రతను పటిష్ఠం చేసిన పోలీసులు వందమందికి పైగా నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని సంఘాలు నేడు మహారాష్ట్ర బంద్ కు పిలుపును ఇవ్వగా, ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.