పేస్ దళం...చూపించాలి బలం

SMTV Desk 2018-01-03 10:59:25  india, south africa, test tour, shami, morkel

కేప్ టౌన్, జనవరి 3 : సౌతాఫ్రికాతో పర్యటనలో భాగంగా భారత్ జట్టు తొలి టెస్ట్ ను సఫారీలతో ఈ నెల 5న తలపడనుంది. ఇంత వరకు భారత్ జట్టు సఫారీ గడ్డపై ఒక్క సిరీస్ గెలవలేదు. ప్రస్తుతం రెండు జట్లు చాలా బలంగా కన్పిస్తున్నాయి. దక్షిణాఫ్రికా తన సొంత మైదానంలో ఆడటం వారికి సానూకులాంశం. మరో వైపు భారత్ స్వదేశంలో సాధించిన విజయాల ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం టీమిండియా ఫాం బట్టి చూసిన సఫారీలను వారి సొంత గడ్డపై మట్టి కరిపించడానికి ఇదే మంచి తరుణం. ముఖ్యంగా సౌతాఫ్రికా పిచ్ ల అంటేనే పేస్ కు పెట్టింది పేరు..అక్కడి మైదానాలు పేస్, బౌన్సు కు వీపరీతంగా సహకరిస్తాయి. సఫారీ బౌలర్ల చండ ప్రచండమైన వేగంతో వచ్చే బంతులను ఎదుర్కోవాలంటే ఎంతటి అనుభవమున్న ఆటగాడైన శ్రమ పడాల్సిందే. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టులో స్టెయిన్, మోర్కెల్, రబడ, ఫిలా౦డర్, వంటి స్పీడ్ స్టార్లను భారత్ ఆటగాళ్లు ఎలా నిలువరిస్తారో చూడాలి. మరో వైపు మన బౌలర్లు కూడా అక్కడి పిచ్ ల పై చెలరేగాలని భావిస్తున్నారు. స్వింగ్ స్పెషలిస్ట్ భువనేశ్వర్,పేస్ స్టార్లు షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, బుమ్రాతో బౌలింగ్ దళం బలంగానే ఉంది. కాకపోతే అక్కడి కుకాబుర్రా తో టీమిండియా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారో వేచి చూడాలి.