ఆ ఖాతాల ద్వారా ఎస్‌బీఐకు వచ్చిన ఆదాయం 1771కోట్లు

SMTV Desk 2018-01-02 17:16:40  sbi, savings account, miimum balance, jhandhan yojan

హైదరాబాద్, జనవరి 2 : ప్రభుత్వ భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఈ ఏడాది కనీస నగదు నిల్వలేని ఖాతాలపై అపరాధ రుసుము విధించడం ద్వారా రూ.1771కోట్లు అర్జించింది. ప్రతి ఒక్కరి ఖాతాలో కనీస నగదు నిల్వ (మినిమమ్‌ బ్యాలెన్స్‌) లేని పక్షంలో ఏ బ్యాంకు అయినా ఖచ్చితంగా రుసుములు వసూలు చేస్తుంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కనీస నగదు నిల్వపై ఎస్‌బీఐ ఎలాంటి ఆదనపు చార్జీలను వసూలు చేయలేదు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఛార్జీలను వసూలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. కాగా ఎస్‌బీఐలో మొత్తం 42కోట్ల పొదుపు ఖాతాలు ఉండగా, అందులో 13కోట్లు సాధారణ పొదుపు ఖాతాలు, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలే కావడం గమనార్హం. అయితే వీటిపై ఎలాంటి ఛార్జీలను ఎస్‌బీఐ వసూలు చేయలేదు.