ఈ నెల 3న అమెరికాతో పాక్ అత్యవసర భేటీ

SMTV Desk 2018-01-02 13:57:07  pakisthan america meeting, pak Prime Minister Shahid Khan Abbasi

ఇస్లామాబాద్‌, జనవరి 02: పాకిస్థాన్ కు అమెరికా దాదాపు 255 మిలియన్‌ డాలర్ల సైనిక సాయం నిలిపివేయడంతో, దీనిపై స్పందించిన ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసి ఈ అంశంపై చర్చించడానికి పాక్‌ జాతీయ భద్రత కమిటీతో అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాక్ పై చేసిన వ్యాఖ్యలకుగాను ఈ సమావేశం జరగనుంది. అయితే, ఈ భేటిలో పాక్‌ విదేశాంగ మంత్రి, అంతర్గత శాఖ మంత్రి, రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులు, సివిల్‌, మిలిటరీ సీనియర్‌ అధికారులు తదితరులు పాల్గొననున్నారు. ఈ నెల 3న అమెరికా పాక్ కు మధ్య భేటీ జరగనుంది.