ఛండీగఢ్‌లో సైకో వీరంగం..

SMTV Desk 2018-01-02 13:00:52  serial killer, chandigarh, haryana, adars nagar colony

ఛండీగఢ్‌, జనవరి 2 : హర్యానాలో దారుణం జరిగింది. ఓ సైకో ప్రవర్తన గల వ్యక్తి ఏ కారణం లేకుండానే ఆరుగురిని అతి కిరాతకంగా హతమార్చి వీరంగం సృష్టించాడు. ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. రాడ్‌తో సంచరించిన ఆ యువకుడు పలువురిపై దాడి చేయగా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. చివరకు ఆదర్శ్‌ కాలనీలో గాయాలతో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, మతిస్థిమితం లేకపోవటంతోనే అతను ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని ఫరిదాబాద్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సీరియల్‌ కిల్లర్‌ నిజంగానే మతిస్థిమితం లేని వ్యక్తేనా..? తదితర వివరాలను వైద్య నివేదిక వచ్చిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.