విశాఖకే ఐఎన్‌ఎస్‌ విరాట్‌ ..

SMTV Desk 2018-01-02 12:34:24  ins virat, vishakapatnam, tourism development, marine project

విశాఖపట్నం, జనవరి 2 : ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌక విశాఖపట్నంకు చేరనుంది. భారత నౌకాదళ సేవల నుంచి విరమించిన ఈ యుద్ధ నౌకను విశాఖ సాగర తీరంలో పర్యాటక ప్రదర్శనశాలగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే కురుసుర జలాంతర్గామి ప్రదర్శనశాల, తాజాగా ఏర్పాటు చేసిన టీయూ-142 యుద్ధవిమాన ప్రదర్శనశాల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నౌకను జాతీయ స్థాయి మెరైన్‌ మ్యూజియంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు పర్యాటక వారసత్వ బోర్డు ఆమోద ముద్ర కూడా వేసింది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు దాదాపు రూ. 300 కోట్లు ఖర్చవొచ్చని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి దీని నిర్వహణకు రూ. కోట్లలో వెచ్చించాలని అధికార వర్గాలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ ప్రాజెక్టు బాధ్యతను వుడా చేపడుతుందని అనుకున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర పర్యాటకశాఖ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని పట్టాలెక్కించాలనే దిశగా కసరత్తులు చేస్తుంది.