నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న తలాక్ బిల్లు

SMTV Desk 2018-01-02 11:22:17  Talaq bill, rajyasabha, Law Minister Ravi Shankar Prasad, delhi

న్యూఢిల్లీ, జనవరి 02 : వెంట వెంటనే ముమ్మారు తలాక్ చెప్పి విడాకులివ్వడాన్ని నేరంగా భావించే "ట్రిపుల్ తలాక్" బిల్లు గతవారం లోక్ సభలో ఆమోదం పొందగా, నేడు రాజ్యసభ ముందుకు రానుంది. పెద్దల సభ బిజినెస్ షెడ్యూల్ లో బిల్లు లిస్టైనట్లు న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రాజ్యసభ ఆమోదం తరువాత బిల్లును రాష్ట్రపతికి పంపుతారు. ఆయన సంతకం చేస్తే చట్టమవుతుంది. అయితే, పెద్దల సభలో తగినంత బలంలేని కేంద్రప్రభుత్వం బిల్లు ఆమోదం పొందే పరిస్థితి లేకపోతే, పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే అవకాశం ఉంది. వెంట వెంటనే ముమ్మారు తలాక్ ను నేరంగా భావిస్తూ బిల్లు తెచ్చిన కేంద్రప్రభుత్వం విడాకులు ఎలా తీసుకోవాలో పేర్కొనలేదు. అయితే, విడాకులు తీసుకునే న్యాయ ప్రక్రియను బిల్లులో చర్చలంటూ, ముస్లిం, మహిళ హక్కుల సంస్థ ఎంపీలకు లేఖలు రాసింది. మరోవైపు కొన్ని ముస్లిం సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముమ్మారు తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదిస్తే, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఇండియాన్ యునియన్ ముస్లింలిగ్ పేర్కొంది.