పాక్.. ఆటలను కట్టిపెట్టు.! : ట్రంప్

SMTV Desk 2018-01-01 19:27:11  America president Donald trump, sensational comments on pakisthaan.

వాషింగ్టన్, జనవరి 1 : నిధుల కోసం అబద్ధాలు చెప్పి పాకిస్తాన్ మోసం చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిప్పులు చెరిగారు. అనేక మోసాలకు పాల్పడుతూ.. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఇది వరకు పలుమార్లు పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ట్రంప్ తన ట్విటర్‌ వేదికగా పాక్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "తెలివితక్కువగా పాకిస్థాన్‌కు దాదాపు 33 బిలియన్‌ డాలర్లకు పైగా అమెరికా నిధులు ఇచ్చింది. కాని ఆ దేశం మమ్మల్ని మోసం చేస్తూ అబద్ధాలు చెప్తూ వస్తుంది. వాళ్లు మా నేతలను ఫూల్స్‌ అనుకుంటున్నారు. పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగానే ఉంది. ఇక అలాంటి ఆటలు సాగవు" అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.