రణరంగంగా మారిన గొట్టిపాడు

SMTV Desk 2018-01-01 18:39:16  GOTTIPADU, STREET FIGHT, PRATTIPADU, GUNTUR

గుంటూరు, జనవరి 1 : కొత్త సంవత్సర వేడుకలో భాగంగా గొట్టిపాడులో రెండు సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం రాత్రి తలెత్తిన ఈ ఘర్షణతో సోమవారం ఉదయం యువకులు వెళ్తుండగా మరో వర్గానికి చెందిన వారు దాడి చేసి గాయపరిచారు. దీంతో గ్రామంలోని రెండు వర్గాలు ఆవేశంతో రాళ్లు రువ్వుకుని, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.