‘ట్రిపుల్ తలాక్’ పై కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది..?

SMTV Desk 2018-01-01 18:23:18  TRIPLE TALAQ BILL, LOK SABHA, RAJYA SABHA, CONGRESS

న్యూఢిల్లీ, జనవరి 1 : ముస్లిం మహిళలకు అండగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లును లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లు పై ముస్లిం మహిళలు ఆనందం వ్యక్తం చేయగా కొన్ని పార్టీలు భిన్నభిప్రాయలు వెల్లడించాయి. ప్రధాన ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ బిల్లును తిరస్కరించకపోయిన కొన్ని మార్పులు చేయాలని డిమాండ్ చేసింది. కాగా రాజ్యసభలో హస్తం పార్టీకి ఎక్కువ బలం ఉండటంతో ఈ బిల్లు ఆమోదం పొందడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ వ్యూహం మంగళవారం ఖరారు కాబోతున్నట్లు సమాచారం. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు, 2017 ప్రకారం వెంట వెంటనే మూడుసార్లు తలాక్ చెప్పి, భార్యకు విడాకులివ్వడం క్రిమినల్ నేరం. ఈ నిబంధనను ఉల్లంఘించిన పురుషునికి మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధిస్తారు. రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొంది, చట్టరూపం దాల్చగానే తలాక్‌ బాధితులు పోలీసులను, లీగల్‌ వ్యవస్థను ఆశ్రయించి తమ భర్తలపై చర్య తీసుకోవాల్సిందిగా కోరవచ్చు.