బీజెపీ- కాంగ్రెస్ మధ్య హోరా హోరి పోరు..!

SMTV Desk 2018-01-01 14:16:54  BJP, CONGRESS, 2018 ASSEMBLY ELECTIONS, NEW DELHI

న్యూఢిల్లీ, జనవరి 1 : మోదీ-అమిత్ షా రాజకీయ చతురత, వ్యూహాత్మక నిర్ణయాలతో బీజెపీ ఇటీవల గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కుంచుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపుతో బీజెపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 19 కి చేరింది. కాగా ఈ ఏడాది రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర, మిజోరం తదితర రాష్ట్రాల్లో ఎన్నికల పోరు జరగనుంది. ఇప్పుడు బీజెపీ తమ వ్యూహాలను, ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రయోగించనుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక. ప్రస్తుత అక్కడి ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిరాడంబర వ్యక్తిగా పేరొందిన, అతని పాలన పై వ్యతిరేకత ఉంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోనూ బీజేపీకి గడ్డు పరిస్థితులు తప్పవని సర్వేలు వెల్లడించాయి. మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్పీపీ)తో బీజేపీ పొత్తు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మొత్తం ఎనిమిది రాష్ట్రాల నుంచి 99 మంది లోక్‌సభ ఎంపీలు ఉండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ- కాంగ్రెస్ 2019 ఎన్నికలుకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయి. కనుక ఈ ఎన్నికల కోసం ఇరు పార్టీల మధ్య హోరా- హోరి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.