కోహ్లీ- ధావన్ న్యూ ఇయర్ డ్యాన్స్ చూశారా..?

SMTV Desk 2018-01-01 12:44:36  kohli, dhawan, new year dance, virak vedio,

కేప్‌టౌన్, జనవరి 01: టీమిండియా క్రికెట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ- శిఖర్ ధావన్ నూతన సంవత్సర వేడుకలలో డాన్స్ వేసి అదరగొట్టారు. ప్రస్తుతం సఫారీలతో సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ఈ క్రికెటర్లు అక్కడి వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక ఓ బ్యాండ్‌కు సంబంధించిన వారు పాటలతో హోరెత్తించగా అక్కడే ఉన్న కోహ్లీ-ధావన్‌ ఆ పాటలకు అనుగుణంగా సూపర్ గా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబధించిన వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ధావన్ డాన్స్ చూసిన అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలి గాయంతో సౌతాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్ కు ధావన్ దూరమైనా సంగతి తెలిసిందే. కాగా భారత్- దక్షిణాఫ్రికా ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ కేప్‌టౌన్ వేదికగా ఈ నెల 5 వ తేదిన జరగనుంది.