కోహ్లీ..2 పుజారా..3

SMTV Desk 2018-01-01 11:26:52  icc test rankings, virat kohli, smith, pujara,

దుబాయ్‌, జనవరి 01: ఐసీసీ 2017 ఏడాదికి గాను ఆఖరి సారి టెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకులు జాబితా విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఆసీస్ సారధి, స్టీవ్ స్మిత్ 947 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకోగా, భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి 893 రేటింగ్ పాయింట్లతో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా నయావాల్ పుజారా మూడో ర్యాంకు దక్కించుకోగా, కేన్ విలియమ్సన్‌ నాలుగు, జోరూట్‌ ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్‌ అండర్సన్‌ 892 రేటింగ్‌ పాయింట్లతో ప్రధమ స్థానంలో నిలిచాడు. టీమిండియా సీనియర్ స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక అల్ రౌండర్ జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబ్‌ అల్‌ హసన్‌ తొలి స్థానంలో ఉండగా రవీంద్ర జడేజా రెండు, రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు స్థానాల్లో నిలిచారు.