ట్విటర్‌లో టాప్ ట్రెండింగ్‌లో "తలైవా"

SMTV Desk 2017-12-31 18:17:51  rajinikanth, political entry, twitter trending.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31 : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులో ఎక్కడ చూసిన ఆయన అభిమానుల కోలాహలమే కనబడుతోంది. ఆయన ప్రకటన అభిమానులను ఒకరోజు ముందుగానే కొత్త సంవత్సరంలోకి తీసుకెళ్ళింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ట్విటర్‌లో తలైవా రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన విషయాలు ట్విటర్‌లో టాప్ ట్రెండింగ్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. "రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ", "సూపర్‌స్టార్"‌, "రజనీ ఫర్‌ తమిళనాడు" తో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లే ట్రెండింగ్‌లో ఉన్నాయి. రజనీ పొలిటికల్‌ ఎంట్రీపై అభిమానులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తలైవా మాకు ఇచ్చిన నూతన సంవత్సర కానుక ఇదే అంటూ ఆయన ఫోటోలకు అభిషేకాలు చేస్తూ.. మిఠాయిలు పంచుకున్నారు.