ఇక్కడ ఒకసారే.. అక్కడ 16 సార్లు...

SMTV Desk 2017-12-31 16:03:10  newyear celebrations, space, iss,

వాషింగ్టన్, డిసెంబర్ 31 : నూతన సంవత్సర వేడుకలు అందరికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తాయి. కాని వారు మాత్రం ఈ వేడుకలు 16 సార్లు జరుపుకుంటారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇంతకి ఎవరు వారు అని ఆలోచిస్తున్నారా.? అసలు విషయం ఏంటంటే.. భూమి చుట్టూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) తిరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఉండే వ్యోమగాములు ఈ కొత్త సంవత్సరం వేడుకలను ఒకే రోజు 16 సార్లు జరుపుకునే వీలుంది. మన భూమిని చుట్టిరావడానికి ఐఎస్‌ఎస్‌ పట్టే సమయం 90 నిమిషాలు. ఈ నేపథ్యంలో అందులో ఉన్న వారు ఒక రోజులో 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను చూస్తారు. ఈ లెక్కన చూస్తే వారు ఈ నూతన సంవత్సర వేడుకలను 16 సార్లు జరుపుకుంటారన్న మాట. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.