2 నుంచి స్కూళ్లలో ప్రవేశాలు

SMTV Desk 2017-12-31 14:54:07  Private schools Admissions on January 2nd started

హైదరాబాద్, డిసెంబర్ 31 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రికగ్నైజ్డ్‌, అన్‌-ఎయిడెడ్‌ సెక్షన్స్‌ కలిగిన ఎయిడెడ్‌ స్కూళ్ల్లలో జనవరి 2 నుంచి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్‌ వంటి బోధనా విధానాలను అమలు చేస్తున్న స్కూళ్లన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. నర్సరీ, ప్రీ-ప్రైమరీ, ఎల్‌కేజీ, ఒకటో తరగతిలో జరిగే ప్రవేశాలన్నింటికీ ఈ షెడ్యూలునే పాటించాలని సూచించింది. ప్రవేశాల సందర్భంగా ఎలాంటి క్యాపిటేషన్‌ ఫీజును వసూలు చేయరాదని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ఈ నిబంధనలను పాటించిన స్కూళ్లకే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల(ఎన్‌వోసీ)ను జారీ చేస్తామని వెల్లడించింది.