ఓడిఎఫ్ బకాసురుల గుట్టు రట్టు...

SMTV Desk 2017-12-31 13:06:36  Toilet construction, ODF, Delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 31 : కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో చేపట్టిన మరుగుదొడ్ల కట్టడాలను కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సర్కార్ కొంత ఆర్థిక సాయం కూడా చేస్తున్నదన్న విషయం తెలిసిందే. అయితే, దీన్ని అలుసుగా తీసుకుని కొందరు అక్రమా సంపాదనగా పోగు చేసుకుంటున్నారు. ఇటీవల ఈ అక్రమాలకు పాల్పడిన వారిపేర్లు బయటపడ్డాయి. వైశాలి జిల్లాకు చెందిన యోగేశ్వర్‌ చౌదరి అనే వ్యక్తి ఏకంగా 42 సార్లు టాయిలెట్‌ నిర్మాణానికి దరఖాస్తు చేసుకొని 3.49 లక్షల ప్రభుత్వ నిధులను కాజేశాడు. విశ్వేశ్వర్‌ రామ్‌ అనే వ్యక్తి కూడా 10 సార్లు దరఖాస్తు చేసుకొని రూ. 91, 200 కొట్టేశాడు. 2015లో జరిగిన ఈ వ్యవహారం ప్రభుత్వ శాఖల్లోని లొసుగులు బయటపడటంతో, వారిపై చర్యలు చేపట్టారు. కాగా, జిల్లా మెజిస్ట్రేట్‌కు సామాజిక కార్యకర్తలు దీనికి సంబంధిత అధికారులపైనా కూడా విచారణ చేయాలని వెల్లడించారు.