పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైన భారత్

SMTV Desk 2017-06-19 12:47:51  champions, india, pakistan, 2017

లండన్: జూన్ 19 : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్స్ హోదా లో భారిలోకి దిగిన భారత్ వరుస విజయాలతో ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయన్ని ముతకట్టుకుంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ముందుగా తడబడుతూ ఆడింది. ఈ దశలో ఫఖార్ జమాన్ 3 పరుగుల వద్ద అవుట్ చేసే చాన్స్ వస్తే దాన్ని భుమ్ర మిస్ చేశాడు. ఇక వచ్చిన అవకాశంతో ఆకాశమే హద్దు గా చెలరేగిన ఫఖార్ జమాన్ కెరీర్ లో మొదటి సెంచరి సాధించాడు. పాకిస్తాన్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ లో ఫఖార్ జమాన్ ( 106 బంతుల్లో 114 ) సెంచరి తో రాణించాడు. అజహరు (79 బంతుల్లో 59 ) పరుగులు చేశాడు. బదర్ ఆజం ( 52 బంతుల్లో46 ) మహమ్మద్ అఫీజ్ ( 37 బంతుల్లో 57) పరుగులతో రాణించడంతో పాకిస్తాన్ స్కోర్ 50 ఓవర్స్ లో 4 వికెట్ నష్టానికి 338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుచింది. 339 పరుగుల లక్ష్యం తో భరిలోకి దిగిన భారత్ అరంభాలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ ను (0) కోల్పోయింది. తరువాత వచ్చిన కోహ్లి కూడా వెంటనే (5) ఔటయ్యాడు. కొద్ది సేపుటికీ ధావన్ (21) యువరాజ్ (22) ధోని (4) తో కూడా ఔటవడం భారత్ ఓటమి అంచుల్లో ఉంది. తరువాత వచ్చిన హార్దిక్ పాండ్య పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పాండ్య వరుసగా సిక్స్ లు ఫోర్లు కొడుతూ పాకిస్తాన్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఈ దశలో ఆఫ్ సెంచరి పూర్తి చేసుకున్నాడు. తరువాత కూడా బ్యాటింగ్ జోరు కొనసాగించాడు. భారత్ అభిమానులంతా పాండ్య గెలిపిస్తాడు అనుకున్నారు. కానీ అనవసర పరుగుకు వెళ్లి హార్దిక్ పాండ్య (76) పరుగుల వద్ద రనౌట్ గా వేనిదిరిగాడు. తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ అందరు ఔటయ్యారు. భారత్ పై పాకిస్తాన్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.