నగరాన్ని అలుముకున్న మంచు దుప్పటి...

SMTV Desk 2017-12-31 12:14:34  telangana weather report, hyderaabad, weather department.

హైదరాబాద్, డిసెంబర్ 31 : నగరాన్ని మంచు దుప్పటి కప్పెస్తోంది. ఎదురుగా ఏముందో కనిపించనంతగా మంచు తెరలు అలుముకుంటున్నాయి. భాగ్యనగరాన్ని చలి గజగజ వణికిస్తోంది. సాధారణం కన్నా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా హైదరాబాద్ లో కనిష్ట స్థాయిలో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, గరిష్టంగా 28.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కావున ప్రజలంతా కాస్త అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.