ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువకుల అరెస్ట్...

SMTV Desk 2017-12-31 11:31:39  Drugs are supplied Four young men The Narcotics Control Bureau has been arrested in delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 31 : నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు, నేడు ప్రతిఒక్కరు సంబరాల్లో తేలుతారు. అయితే, ఈ వేడుకల్లో భాగంగా దేశరాజధాని ఢిల్లీలో తనిఖీలు ముమ్మరం చేయగా, ఎల్‌ఎస్‌డీతోపాటు చరస్‌ (కెనాబిస్)ను సరఫరా చేస్తున్న నలుగురు యువకులను ఢిల్లీ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్టు చేసింది. కొత్త సంవత్సర వేడుకల్లో విద్యార్థులే లక్ష్యంగా ఎల్‌ఎస్‌డీ (లైసర్జిక్‌ యాసిడ్‌ డైఎథిలమైడ్‌) మత్తు పదార్థాలను విక్రయిస్తుండటంతో, సమాచారం అందుకున్న పోలీసులు వీరి నుంచి 1.14 కిలోల చర్‌సను, 3 ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌ పేపర్లను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.