కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించిన సాక్షి మాలిక్‌

SMTV Desk 2017-12-31 10:30:04  sakshi malik, babitaa kumari, qualify, cwg, fold coast

న్యూఢిల్లీ, డిసెంబర్ 31 : వచ్చే ఏడాది కిర్గిస్థాన్‌లో జరగనున్న సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు భారతీయ మహిళా రెజ్లింగ్‌ టీం ఎంపిక శనివారం లక్నోలో జరిగింది. ఒలంపియన్ మల్లయోధురాలు, హర్యానా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ 62 కేజీల విభాగంలో62 కేజీల 2018లో జరగనున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌(సీడబ్ల్యూజీ)కు అర్హత సాధించింది. సీడబ్ల్యూజీ 2018 ఏప్రిల్‌ 4 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌ వేదికగా జరగనుంది. మాలిక్ తో పాటు వినేష్‌ ఫొగాట్(50 కేజీలు)‌, పూజా ధాండా(57కేజీలు), బబితా కుమారి ఫొగాట్(54 కేజీలు)‌, దివ్య కరణ్(68కేజీలు)‌, కిరణ్‌(76 కేజీలు) విభాగాల్లో రెండు టోర్నమెంట్లలో క్వాలిఫై అయ్యారు. రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్ కూడా 74 కేజీల కేటగిరిలో శుక్రవారం నాడు జితేంద్ర కుమార్‌ను ఓడించి కామన్‌వెల్స్ గేమ్స్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.