కోహ్లీ సేనకు కష్టమే : మోర్నీ మోర్కెల్‌

SMTV Desk 2017-12-30 18:43:00  MORNE MORKEL, SOUTH AFRICA, INDIA TOUR, KOHLI

కేప్‌టౌన్‌, డిసెంబర్ 30 : కోహ్లి సేన సొంత గడ్డపై ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి ఇప్పుడు ఆదే హవాను దక్షిణాఫ్రికాలో కొనసాగించాలని భావిస్తుంది. కానీ అది అంతా సులభం కాదని ఇప్పటికే చాలా మంది క్రికెట్ మాజీ దిగ్గజాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సఫారీ అంటే పేస్ దళం, బెంబేలెత్తించే బౌన్సర్లు, వారి బౌన్సు పిచ్ లను టీమిండియా జట్టు ఎలా ఎదుర్కుంటుందో అని యావత్ భారత్ క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై సౌతాఫ్రికా జట్టు పేసర్ మోర్నీ మోర్కెల్‌ మాట్లాడుతూ.. "టీమిండియా జట్టుకు జనవరి 5న ప్రారంభమయ్యే టెస్ట్‌ సిరీస్‌ అగ్ని పరీక్ష. గాయం నుండి కోలుకున్న డేల్‌ స్టెయిన్‌ నెట్స్ లో అత్యుత్తమంగా బంతులు వేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ పరంగా చాలా బలంగా ఉన్నాడు. ఇక్కడ సిరీస్ నెగ్గడం కోహ్లీ సేనకు కష్టమే” అని వ్యాఖ్యానించారు. కాగా భారత్ జట్టు సౌతాఫ్రికా గడ్డపై సఫారీలతో మూడు టెస్ట్‌లు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే. మూడు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ కేప్‌టౌన్‌ వేదికగా జనవరి 5న జరగనుంది.