తెలంగాణ ట్రాన్స్‌కోలో 1604 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

SMTV Desk 2017-12-30 18:10:54  telangana transco, recruitment notification release,

హైదరాబాద్‌, డిసెంబర్ 30 : ట్రాన్స్‌కోలో రెగ్యులర్‌ ప్రాతిపదికన 1604 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు విద్యుత్‌సౌధలో ట్రాన్స్‌కో పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను ఆమోదించగా, ఏఈ (ఎలక్ట్రికల్‌/సివిల్‌/టెలికాం), సబ్‌ ఇంజనీరు(ఎలక్ట్రికల్‌), జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇందులో 1100 జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టులుండగా, 330 ఏఈ, 174 సబ్‌ ఇంజనీరు పోస్టులున్నాయి. మిగతా వివరాలను http://tstransco.cgg.gov.in వెబ్‌సైట్‌లలో పొందుపరచనున్నారు.