పాకిస్తాన్ కి వెళ్లేందుకు సిద్దమైన రాందేవ్ బాబా

SMTV Desk 2017-06-19 12:11:02  Pakistan,Baba Ramdev,International Yoga Day,Indian Goverment

హరిద్వార్, జూన్ 19 : సాధారణంగా విదేశాలతో సంబంధం పెట్టుకునేందుకు పర్యటన నిమిత్తం వెళ్ళే వారిలో ఒక దేశ ప్రధాని, ఒక దేశ అధ్యక్షుడు, ఇతర రాజకీయ నేతలు మాత్రమే ఉంటారు. ఏ రాజకీయ సంబంధం లేని ఒక యోగా గురువు విదేశీ పర్యటన చేసి ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడేలా ప్రయత్నాలు చేస్తాననడం ఆశ్చర్యం కల్గిస్తుంది. పాకిస్థాన్‌ వెళ్లి అక్కడివారికీ యోగా నేర్పిస్తానంటున్నారు యోగా గురువు రాందేవ్‌బాబా. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్‌లో యోగాకార్యక్రమం నిర్వహించాల్సిందిగా పాక్‌ నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని చెప్పారు. పాక్‌లోని ప్రతీ ఒక్కరూ ఉగ్రవాదులు కారు. మన దాయాది దేశస్థులు కూడా యోగా నేర్చుకోవాలని ఆశిస్తున్నారు. కానీ పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణమే నన్ను కలచివేస్తోంది. అయినా సరే నేను పాక్‌కి వెళ్లాలనుకుంటున్నా’. అని ఆయన అన్నారు. ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలపాలి. దీనిపై ఆలోచించడానికి భారత ప్రభుత్వానికి ఇదే సరైన సమయం. 1993 ముంబయి పేలుళ్లలో ప్రధాన నిందితులైన దావూద్‌ ఇబ్రహీం, జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌, జమాత్‌ అధినేత హఫీజ్‌ సయీద్‌లను భారత్ కు ఆప్పగించాలని, పాకిస్తాన్ వాసులంతా చెడ్డవారు కాదని కొందరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని రాందేవ్‌బాబా తెలిపారు.