స్నేహం పేరుతో రేప్ చేసి చంపిన యువకుడు

SMTV Desk 2017-06-19 11:35:31  friend, boy, girl, rep

ఖగారియా( బీహార్), జూన్ 19 : నేటి సమాజంలో అమ్మాయిలను స్నేహం పేరుతో మోసం చేసిన యువకులు చాలా మంది ఉన్నారు. అలాంటి సంఘటనే ఇది ఓ యువతిని స్నేహం పేరుతో అత్యాచారం చేసి కిరోసిన పోసి చంపినా ఘటన బీహార్ లో ని ఖగారియా లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టెంతాకరారీ గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ఒకే కళాశాలలో చదువుతున్నారు. గత కొంత కాలంగా నుంచి స్నేహం చేస్తున్నారు. ఈ మధ్య ఆదివారం రోజున యువతి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న యువకుడు అమ్మయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తరువాత ఆమె పై బలవంతంగా అత్యాచారం చేసి వెంటనే ఆమె పై కిరోసిన్ పోసి నిప్పంటిచాడు. వెంటనే ఇంటి బయట తాళ్ళం వేసి యువకుడు పారిపోయాడు. యువతి అరుపులు విన్న స్థానికులు తాళ్ళం పగలగొట్టి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆమె చనిపోయేముందు తనని అత్యాచారం చేసి నిప్పటిచింది. తన స్నేహితుడేనని పోలీసులకు చెప్పి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇది తెలుసుకొని అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేద్దామని వెళ్తే కుటుంబం తో పాటు యువకుడు పారిపోయాడు. అతని కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు.