లక్ష్యం 4,121.. పూర్తయింది ఒక్కటి

SMTV Desk 2017-12-30 15:28:03  telangana, swachha bharath, school toilets, odf,

హైదరాబాద్, డిసెంబర్ 30: బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా మార్చేందుకు కేంద్రం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమం కొన్ని శాఖల నిర్లక్ష్యం వలన అమలులో జాప్యం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కార్ పాఠశాలల్లో 4121 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు నిర్మించిన మరుగుదొడ్లు ఎన్నో తెలుసా..? అక్షరాల ఒకటి.. ఇందుకు కారణం వివిధ శాఖల అలసత్వం అని తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ప్రారంభం నాటికి స్కూళ్లలో టాయిలెట్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. వీటిలో ముఖ్యంగా బాలికల స్కూళ్లను ఎంపిక చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచేసరికి మరుగుదొడ్లు వచ్చేస్తాయని అందరు అనుకున్నారు. కానీ దాదాపు 8 నెలలు కావస్తున్న ఒక్క టాయిలెట్ పూర్తి కావడంపై అధికారుల చిత్త శుద్ధి ఏమిటో అర్ధం అవుతుంది. ఇప్పటికైనా ఈ విషయంపై అధికారులు స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్ధులు కోరుతున్నారు.