ప్రభుత్వం ముస్లింల మనోభావాలతో ఆటలాడుతోంది : జీవన్‌రెడ్డి

SMTV Desk 2017-12-30 11:52:38  CLP Deputy Jeevan Reddy, comments on triple talaq, central govt.

హైదరాబాద్, డిసెంబర్ 30 : కేంద్రప్రభుత్వం ఇటీవల ముస్లిం మహిళల సంరక్షణ నిమిత్తం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేంద్రప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు పేరిట ముస్లింల మనోభావాలతో ఆటలాడుతోందని ఆరోపించారు. తన పార్టీ తరపున ఈ తలాక్ బిల్లును ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఒకవైపు.. దేశంలో పౌరులందరికీ ఒకే చట్టం అని, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారని వాపోయారు.