పార్లమెంటుకు 1న సెలవు...

SMTV Desk 2017-12-30 11:08:24  parliament meetings, lokh sabha, rajya sabha

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పార్లమెంటులో జరుగుతున్న శీతాకాల సమావేశాలకు ఒకరోజు సెలవు ప్రకటించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తొలిరోజు (జనవరి 1) న సెలవు ఇస్తున్నట్లు లోక్‌సభ, రాజ్యసభల్లో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేతలు సహా పలు పార్టీలు చేసిన అభ్యర్థనకు అనుగుణంగా సెలవు నిర్ణయించినట్లు పార్లమెంటరీ అధికారులు తెలిపారు.