పవన్ ఎప్పటికి అర్ధం కారు : కేటీఆర్‌

SMTV Desk 2017-12-29 17:56:56  IT Minister KTR, TWITTER CHAT, CONVERSATION.

హైదరాబాద్, డిసెంబర్ 29 : ఎన్నో పనులతో నిత్యం బిజీగా ఉండే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. రెండు గంటలకుపైగా నెటిజన్లకు అందుబాటులో ఉండి "ఆస్క్‌కేటీఆర్‌హ్యాష్‌" ట్యాగ్‌తో ప్రశ్నలు అడగాల్సిందిగా స్వయంగా ఆయనే ట్విటర్‌ వేదికగా కోరారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత ఆసక్తులను, రాజకీయం, ప్రభుత్వ పాలన వంటి వాటిపై ఆసక్తికరమైన సమాధానాలను ఇచ్చారు. సానుకూల ఫలితాలు సాధించే టాస్క్‌ మాస్టర్‌ సీఎం కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాని అమితంగా ఇష్టపడతానని, మంత్రి హరీశ్‌ రావు మొండి పట్టుదల కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు.ఈ సందర్భంగా కేసీఆర్‌ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ లో పని చేశారన్న ఒక ప్రశ్నకు, తప్పులు అందరూ చేస్తారు కాని, తెలివైనవాళ్లు మాత్రమే వాటి నుంచి నేర్చుకుంటారని సమాధానమిచ్చారు. * సోనియానా, మోదీనా..? > దేశంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే లేద౦టూ.. సోనియా రాజకీయాల నుంచి రిటైరైన విషయాన్ని గుర్తుచేశారు. * చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావడం లేదు కదా.? > ప్రభుత్వం, ప్రజలు వేర్వేరు అనే భావన ఉంది, నిజానికి అవి రెండూ కలిస్తేనే ప్రజాస్వామ్యమన్నారు. * కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి గురించి చెప్పండి.? > రేవంత్ రెడ్డి ఎవరు..! * 1+1=? ఎంత..? > రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు ఎన్నటికీ కాలేవు అంటూ పేర్కొన్నారు. అలాగే సినీతారల గురించి ప్రస్తావిస్తూ.. అల్లు అర్జున్‌ స్టైలిష్‌.. మహేశ్‌ బాబు ఒక సూపర్‌ స్టార్‌.. ప్రభాస్ బాహుబలి.. జూనియర్‌ ఎన్టీయార్‌ ఒక పెర్ఫార్మర్‌ అని అభివర్ణించారు. అలాగే పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడుతూ.. ఆయన ఒక ఎనిగ్మా (ప్రహేళిక- అర్థం చేసుకోవడానికి కష్టమైన వ్యక్తి) అని, ఆయన రాజకీయ జీవితాన్ని ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్‌ తన అభిమాన నటుడని, ఇండియన్‌, చైనీస్‌ తనకు ఇష్టమైన ఆహారమని తెలిపారు. తాను కర్మను నమ్ముతానని, ఫిట్‌గా ఉండడమే ఈ నూతన సంవత్సర తీర్మానమని ఈ సందర్భంగా అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.