వచ్చే వారం రాజ్యసభకు వెళ్లనున్న ‘ముమ్మారు తలాక్’ బిల్లు

SMTV Desk 2017-12-29 17:12:32  triple talaq, rajyasabha, loksabha, president

న్యూఢిల్లీ, డిసెంబర్ 29 : కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు- 2017’ కు లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుత సమాజంలో ముస్లిం మహిళలకు జరుగుతున్న అమానవీయ చర్యకు ఈ బిల్లు ఒక ప్రధానాస్త్రంగా నిలవనుంది. ‘ట్రిపుల్ తలాక్’ నేరమంటూ లోక్‌సభలో గురువారం ఆమోదం పొందిన ఈ బిల్లు వచ్చేవారంలో రాజ్యసభ ముందుకు రానుంది. కాగా ఈ బిల్లుపై ప్రతి పక్ష పార్టీలు మద్దతు తెలుపుతూనే, విడాకులు పొందిన ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా మరిన్ని నిర్దిష్టమైన అంశాలను బిల్లులో చేర్చాలని పట్టుబట్టింది. లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభ అంగీకారం తెలిపిన తర్వాత రాష్ట్రపతి కి పంపిస్తారు. దేశ ప్రధమ పౌరుడు ఆమోదముద్ర వేయగానే బిల్లు చట్టంగా మారుతుంది.