భాగ్యనగరంలో ‘రోబో పోలీస్’...

SMTV Desk 2017-12-29 15:32:27  robo police, h boats robotics, hyderabad, it secretary, jayesh ranjan

హైదరాబాద్, డిసెంబర్ 29 : సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత సమాజంలో హైదరాబాద్ పోలీస్ శాఖ విన్నూత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఫిర్యాదులు, అనుమానితులను, బాంబులను గుర్తించే రోబో పోలీస్‌ విధుల్లో చేరనుంది. నూతన సంవత్సర సందర్భంగా ఈ ఆదివారం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌లో రోబో పోలీసు విధులు చేపట్టనుంది. అంతే కాకుండా ప్రపంచంలో రెండో రోబో పోలీసుగా రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే దుబాయ్ లో చక్రాలపై కదిలే రోబో పోలీసు విధులను నిర్వహిస్తుంది. కాగా నగరంలో ఈ రోబో పోలీస్ ను టీ-హబ్‌లో స్టార్టప్‌ కంపెనీగా ప్రారంభమైన ‘హెచ్‌ బోట్స్‌’ రోబోటిక్స్‌ కంపెనీ తయారు చేసింది. తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ రోబోను ఈ రోజు లాంఛనంగా ఆరంభించి నగర పోలీసులకు అందించనున్నారు.