భార్యను రేప్ చేసిన భర్త అతని స్నేహితులు

SMTV Desk 2017-06-18 19:04:02  hasbend, frinds, wife, rep

బెంగళూరు, జూన్ 18 : భార్యని భర్త అతని స్నేహితులు కలిసి అత్యాచారం చేసిన సంఘటన భారతీనగర్ లో చోటుచేసుకుంది. భారతీ నగర్ లోని శివాజీ నగర్ ప్రాంతంలో బంబూ బజార్ లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ దంపతులిద్దరు మధ్య చాలా రోజుల నుంచి మనస్పర్ధలు వచ్చి గొడవలు పడుతున్నారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఆమె కఠిన ఉపవాసం ఆచరిస్తున్నది. ఈ నెల 11 తన భర్త బయటకు వెళ్దామని చెప్పి ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి తన భర్త స్నేహితులు ముగ్గురు ఉన్నారు. భర్త అతని స్నేహితులు కలిసి తనపై సాముహిక అత్యాచారం చేసారని ఆమె చెప్పింది. తీవ్ర అస్వస్థతకు లోనైనా ఆమె స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. రంజాన్ ఉపవాసం చేస్తున్న కూడా భర్త ఇంత దారుణానికి ఒడిగాడుతడని అనుకోలేదని ఆమె చెప్పింది. అత్యాచారం జరిపిన వారిపై పోలీసులకు ఆమె ఇచ్చిన మౌఖిక పిర్యాదు చేసింది. రంజాన్ మాసం ముగిసక వారి పై లిఖితపుర్వకంగా పిర్యాదు చేస్తామని ఆమె చెప్పింది.