హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం..

SMTV Desk 2017-12-29 13:29:35  drugs, Nigerians, hyderabad, west zone task force olice

హైదరాబాద్, డిసెంబర్ 29 : హైదరాబాద్ డ్రగ్స్ భూతం మళ్లీ వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకుల కోసం మాదక ద్రవ్యాలు తీసుకొస్తున్న ముగ్గురు నైజీరియన్లను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుండి 225 గ్రాముల కొకైన్, 30 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి నుండి మరింత సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.