నేడు రాజ్యసభకు పంపనున్న "తక్షణ తలాక్‌" బిల్లు

SMTV Desk 2017-12-29 12:55:00  Talaq bill rajyasabha, supreme court, new delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 29 : ఈ నెల 28న లోక్‌సభ "తక్షణ తలాక్‌" బిల్లుపై దిగువ సభ ఆమోద ముద్ర వేసింది. "ముస్లిం మహిళల తలాక్‌ కష్టాలు ఎదురు కాకుండా తక్షణమే చూడాలని, బీజేపీ నేతలు సగర్వంగా ప్రకటిస్తూ, బల్లలు చరుస్తూ బిల్లుకు ఆమోదం పలికారు. "ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణగా ఈ బిల్లును "తక్షణ తలాక్‌" గా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గురువారం సభ ముందు ప్రవేశ పెట్టారు. కానీ, దీనికి ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ బిల్లును వ్యతిరేకించారు. 3 సవరణలను సభ 241-2 ఓట్ల తేడాతో తిరస్కరించింది. బిల్లును గతంలోలాగే ఆమోదించింది. దీన్ని నేడు రాజ్యసభకు పంపనున్నారు. అయితే, ఈ విషయంపై ఆగస్టులో సుప్రీంకోర్టు ముమ్మారు తలాక్‌ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ మేరకు 6 నెలలోపు చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్రప్రభుత్వం దీనిపై కసరత్తు చేసి బిల్లు తెచ్చింది.