ఆధార్ పై స్పందించిన ఫేస్‌బుక్‌

SMTV Desk 2017-12-28 18:13:38  facebook, adhar link, fake accounts.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : బ్యాంకు ఖాతా తెరవాలన్నా, మొబైల్ సిమ్ కార్డు కోసమైనా ఇటీవల ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కూడా ఖాతా తెరవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అంటూ ప్రకటించింది. దీంతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాదారులని అరికట్టవచ్చనేది ఫేస్‌బుక్‌ ఆలోచన. కాని ఈ ఆలోచనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఎట్టకేలకు ఈ విషయంపై ఫేస్‌బుక్‌ స్పందిస్తూ.. "మేము ఎలాంటి ఆధార్ వివరాలను అడగడం లేదు. ఆ కార్డుపై ఉన్న పూర్తి పేరును మాత్రమే అడుగుతున్నాం. అంతేకాని ఆధార్ కార్డు నెంబర్ కూడా మేము అడగడం లేదు" అంటూ వివరణ ఇచ్చింది.