భూ కుంభకోణం పై సీబీఐ విచారణ జరపాలి : రామకృష్ణ

SMTV Desk 2017-06-18 18:41:12  AP, Visakhapatnam earthquake, CBI investigation,CPI state secretary Ramakrishna

విజయవాడ, జూన్ 18 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రూ. 20 వేల కోట్ల విలువైన భూములు, భూకుంభకోణంలో అధికార పార్టీ నేతలూ ఆరోపణలు ఎదుర్కొంటున్నందున దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. రాజధానిలో మరో 14వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. గతంలో సేకరించిన భూమిలో ఇంకా నిర్మాణాలు చేపట్టకపోగా.. మళ్లీ భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా ఒకేచోట జరుగుతుండటంతో రాష్ట్రం మరోసారి విడిపోయే ప్రమాదం ముందని ఆందోళన వ్యక్తం చేశారు.