గౌరవప్రదమైన సర్వేలో మళ్లీ మాజీ అధ్యక్షుడు ఒబామా

SMTV Desk 2017-12-28 18:10:32  Former President Obama again in a respected survey, us

వాషింగ్టన్‌, డిసెంబర్ 28 : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు అమెరికన్లు మరోసారి పట్టం కట్టారు. అమెరికాలో అత్యంత గౌరవప్రదంగా ఆరాధించే వ్యక్తిగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వరుసగా పదోసారి చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు అమెరికాలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు 14 శాతం ఓట్లు రాగా, ఒబామాకు 17 శాతం వచ్చాయి. ట్రంప్‌ సతీమణి మెలానియా కేవలం ఒక్క శాతం మాత్రమే సాధించారని సర్వేలో తేలింది. ఈ సర్వేను 1946 నుంచి ప్రారంభించగా, ఇప్పటివరకు మొత్తం ఈ సర్వేను 71 సార్లు నిర్వహించారు. కాగా, అధికారంలో ఉన్న అధ్యక్షులే 58 సార్లు ప్రథమ స్థానంలో నిలువడం జరిగింది. అయితే, ఈ సర్వేలో భాగంగా అత్యధికంగా బిల్‌ క్లింటన్‌ 22 సార్లు ఈ గౌరవాన్ని పొందడం విశేషం.