వన్డేల్లో 400 పరుగుల వ్యక్తిగత స్కోర్ చూస్తాం : కపిల్ దేవ్

SMTV Desk 2017-12-28 16:20:58  KAPIL DEV, QUADREPUL CENTURY, FORMER INDIAN CRICKTER, NEW DELHI

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : ప్రస్తుత క్రికెట్ లో పరుగులు ప్రవాహంకు అడ్డు అదుపు లేకుండా పోయింది. బ్యాట్స్ మెన్లు చాలా సులభంగా సెంచరీలు, డబుల్ సెంచరీలు సాధిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై భారత్ మాజీ క్రికెట్ ఆటగాడు కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డేల్లో వ్యక్తిగత ట్రిపుల్‌ సెంచరీ సాధ్యమేనా..? అన్న ప్రశ్నకు కపిల్‌ తనదైన శైలిలో స్పందిస్తూ..." మేము ఆడే రోజుల్లో 35 బంతుల్లో సెంచరీ అనేది ఎప్పుడూ వినలేదు. కానీ అది సాధ్యమైంది. నేను ఆడే రోజుల్లో ఆటకు నేటితరం ఆటకు చాలా మార్పులు వచ్చాయి. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కాదు. 400 వ్యక్తిగత స్కోరును కూడా చూస్తాం. టెస్టు క్రికెట్ ను ఉదాహరణగా తీసుకుంటే అప్పటిలో ఆట ముగిసే సమయానికి 280 పరుగుల్ని ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు ఆ పరుగులు 20 ఓవర్లలోనే వస్తున్నాయి. అంటే క్రికెట్‌ చాలా పరిణితి చెందింది." అని ఈ సందర్భంగా వెల్లడించారు.