ఏటీఎంను ధ్వంసం చేసి, బ్యాంకు సిబ్బందికి తెలిపాడు...

SMTV Desk 2017-12-28 15:22:17  ATM Touchscreen Destroyed Florida in the United States

ఫ్లోరిడా, డిసెంబర్ 28 : ఏటీఎంలోకి వెళ్లిన ఓ వ్యక్తి తనకు కావలసిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు వచ్చిందని ఏకంగా ఏటీఎం టచ్‌స్క్రీన్‌ ను ధ్వంసం చేసిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. బ్యాంకు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... జోసెఫ్‌ అనే వ్యక్తి పని నిమిత్తం బయటికి వచ్చి, ఏటీఎంకు వెళ్లాడు. అందులో అతను అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి. దాంతో జోసెఫ్‌ ఏటీఎం టచ్‌స్క్రీన్‌ను ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ ఏటీఎంకు సంబంధించిన బ్యాంక్‌కు ఫోన్‌ చేసి ఏటీఎంలో అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తోంది. అందుకే పగలగొట్టేశానని చెప్పాడు. అది విన్న బ్యాంకు సిబ్బంది కంగుతిన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఏటీఎంలో అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చాయని వారు తెలిపారు. కాగా, ఏటీఎంను ధ్వంసం చేసినందుకు జోసెఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.