అయిదేళ్లలోపు పిల్లలకు బయోమెట్రిక్ అవసరం లేదు: వి.కె. సింగ్‌

SMTV Desk 2017-12-28 13:38:00  BIOMETRIC, 5 YEARS CHILDREN, PASS PORT, V.K SINGH

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : బయోమెట్రిక్.. ప్రస్తుత అన్ని రంగాల్లో ఈ సాంకేతికతను విరివిగా వాడుతున్నారు. తాజాగా ఐదేళ్లు, అంతకన్నా లోపు వయసున్న చిన్న పిల్లలు, శిశువులకు పాస్‌పోర్టు మంజూరులో బయోమెట్రిక్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్‌ వెల్లడించారు. అయితే ఫొటోల నిమిత్తం వారిని తప్పకుండా పాస్ పోర్టు సేవా కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ వీరికి మినహాయింపు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి వినతులు వచ్చాయని చెప్పారు.