బ్యాచిలర్ లైఫ్ కు బై..బై చెప్పిన క్రునాల్ ..

SMTV Desk 2017-12-28 13:08:02  KRUNAL MARRIAGE, PANKHURI SHARMA, SACHIN, MUMBAI INDIANS

ముంబై, డిసెంబర్ 28 : టీమిండియా క్రికెటర్, అల్ రౌండర్ హార్దిక్ పాండ్య సోదరుడు క్రునాల్ పాండ్య వివాహం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. నిన్న ముంబైలో కృనాల్‌-ఫంకురిల పెళ్లి సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున పాండ్య సోదరులు ఆడటంతో మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌తో వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సచిన్‌ కృనాల్‌ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. హార్దిక్, సచిన్ కు ఎదురెళ్లి ఆహ్వానించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.