రైలు చార్జీలు పెంచే ఆలోచన లేదు : కేంద్రం

SMTV Desk 2017-12-28 13:02:46  train charges, central government, Railway Minister Rajan Gohain, railway department.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : రైలు చార్జీలు పెరుగుతాయి అంటూ వస్తున్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఇప్పట్లో రైలు చార్జీలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ సహాయమంత్రి రాజన్‌ గోహయిన్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. నాటితో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రయాణికుల రద్దీ 0.68 శాతం పెరిగిందని తెలిపారు. అలాగే పండగలు, కొన్ని ప్రత్యేక సందర్భాలలో రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఈ రైళ్లకు మాత్రమే ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తున్నామని వెల్లడించారు.